Samantha : భారీగా పెంచేసిన స‌మంత

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అన్ని భాషలలో తన హవా కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బోల్డ్ గా పలు సినిమాలలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక అంతే కాకుండా పలు కొటేషన్లను షేర్ చేస్తూ, పలు జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఎక్కువగా తన సమయాన్ని సోషల్ మీడియాలోనే కేటాయిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నాగచైతన్యతో విడాకుల తర్వాత బోల్డ్ ఫొటోస్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. పుష్ప సినిమాలో ‘ఊ అంటావా’ అంటూ ఐటెం సాంగ్ తో కుర్ర కారును ఉర్రూతలూగించింది. ఇక ఆటు స్టార్ హీరోయిన్ సమంత తెలుగు తో పాటు హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ప చిత్రంతో ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న సమంత, అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో  సామ్ సైన్ చేయబోయే సినిమాలకు దాదాపు రూ.8 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. అంతేకాకుండా త్వరలోనే ముంబైలో రూ.30 కోట్లతో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. సమంత నటించిన యశోద సినిమా నవంబర్ 11న విడుదలకు సిద్ధమవుతుంది. మరోవైపు ఇప్పటికే శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్, విజయ్ దేవరకొండ తో ఖుషి చిత్రంలో నటిస్తుంది. ఇక అటు కొన్ని ప్రముఖ యాడ్స్ లోనూ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు