Samantha: ఆ తప్పు కారణంగానే అక్కినేని ఇంటి కోడలుగా సెటిల్ కాలేకపోయారా..?

 

అక్కినేని యువ జంట నాగచైతన్య – సమంత విడిపోవడం ఇరువురి ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి విడాకుల ప్రకటన వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ చై – సామ్ డివర్స్ మేటర్ జనాల్లో హాట్ టాపిక్ గానే నడుస్తుంది. ఈ ఇష్యూ పై సినీ వర్గాల్లో ఎక్కడో చోట ఏదో ఒక రకమైన డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఒకరంటే ఒకరు ఇష్టపడి ఏరి కోరి వివాహం చేసుకొని.. మళ్లీ విడాకులు ఎందుకు తీసుకున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఈ జంట విడాకులు తీసుకోవడానికి ఇదే కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటిదే తాజాగా మరో వార్త వైరల్ గా మారింది. సమంత విడాకులు తీసుకోవడానికి తన మాజీ అత్తగారు లక్ష్మీ కారణమంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో లక్ష్మీ చేసిన తప్పే ఇప్పుడు సమంత కూడా చేసిందని.. ఆ తప్పు కారణంగానే నాగర్జునకు లక్ష్మీ దూరమైతే.. ఇప్పుడు అదే తప్పు చేసి నాగచైతన్యకు సమంత దూరమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

వరుస ఫ్లాప్ సినిమాలతో హిట్ కొట్టలేక బాధపడుతున్న నాగార్జునను లక్ష్మి ఓదార్చి, ఆయనకు నచ్చిన విధంగా నడుచుకుని ఉంటే నాగార్జునకు లక్ష్మీపై ప్రేమ అలాగే ఉండేదని.. వాళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉండేవి కావని చెబుతున్నారు. అంతేకాదు ఇప్పుడు నాగచైతన్య పొజిషన్ కూడా అలాంటిదేనని.. సినిమాలలో సరైన సక్సెస్ లేక, మరోవైపు స్టార్ హీరోయిన్ భర్త అని అందరూ చెప్పుకునే స్థాయికి దిగజారిపోవడం, ఈ పరిస్థితుల్లో సమంత అర్థం చేసుకోకుండా రెచ్చిపోయి మాట్లాడడమే వీరి విడాకులకు కారణం అంటూ ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఇప్పటికైనా ఓసారి ఆలోచించి వారు మళ్ళీ కలిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు