Kushi: నటిగా ఎన్ని కోట్లు సంపాదించినా.. సమంతకి ఆ యోగం లేదు!

Samantha is not lucky

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సమంత ఏళ్లు గడిచినా తన అందం, నటనతో మాయ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఏమైందో తెలియదు వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది సమంత. ఇక ఇటీవల మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది సమంత.

దీంతో ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆమె నటించిన ఖుషి, సిటాడెల్ షూటింగ్ లు పూర్తిచేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. ఆధ్యాత్మిక సేవలో, మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలో ఉంటుంది. గ్రీనరీ ని ఎంజాయ్ చేస్తూ చిన్న పిల్లలతో ఆడుకుంటుంది. అలాగే యోగాసనాలు చేస్తూ, జిమ్ లో శ్రమిస్తూ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. అయితే సమంత నటిగా ఎన్ని కోట్లు సంపాదించుకునా వైవాహిక జీవితం మాత్రం నాశనం అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుఖం లేకుండా పోయింది.

విడాకుల తరువాత వీరిద్దరూ ఎవరి జీవితంలో వారు అన్నీ మరిచిపోయి మూవ్ అవుతున్నారు. అయితే వీరిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అభిమానుల కోరిక. దీనికి నాగచైతన్య కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. తనకు రెండోసారి ప్రేమ పుడుతుందని.. అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కానీ సమంత మాత్రం తన రెండవ పెళ్లి గురించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే సమంత ఇప్పటికీ నాగచైతన్యను మరిచిపోలేదా..? లేక ఆమెకి రెండవ పెళ్లి చేసుకునే యోగం లేదా..? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు