Salaar : ఈ పాపులర్ థియేటర్లలో “సలార్” లేదు… మేకర్స్ షాకింగ్ డెసిషన్

మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న “సలార్” మూవీ థియేటర్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని థియేటర్లలో “సలార్” మూవీని రిలీజ్ చేయకూడదని షాకింగ్ తీసుకున్నారు మేకర్స్. మరి సలాడ్ దర్శక నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? కేవలం ఆ థియేటర్లకు మాత్రమే ఎందుకు సినిమాను ఇవ్వబోమని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారు? ఇంతకీ “సలార్” విషయంలో జరుగుతున్న రాజకీయాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా “సలార్” ఫీవరే కనిపిస్తోంది. కానీ ఉత్తరాదిన మాత్రం ఈ సినిమాకు కావాల్సినన్ని థియేటర్లు ఇవ్వకుండా, “సలార్” మేకర్స్ ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. “సలార్” రిలీజ్ కు ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 21న షారుక్ ఖాన్ హీరోగా నటించిన “డంకీ” మూవీ రిలీజ్ ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద క్లాష్ ఏర్పడింది. అయితే సాధారణంగా ఇలాంటి క్లాష్ ఏర్పడినప్పుడు రెండు సినిమాలకు సమానంగా థియేటర్లను ఇచ్చి ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. కానీ “సలార్” విషయంలో మాత్రం నార్త్ లో ఉద్దేశపూర్వకంగానే థియేటర్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. దీంతో “సలార్” టీం కొన్ని థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లో పివిఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో “సలార్” మూవీని రిలీజ్ చేయకూడదని మూవీ టీం డిసైడ్ అయ్యిందని సమాచారం.

నార్త్ లో పివిఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్ లో యాజమాన్యాలు “సలార్” మూవీని పూర్తిగా పక్కన పెట్టేసి, “డంకీ” మూవీకి స్క్రీన్లు ఇస్తున్నాయని, దీంతో సింగల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ లను ఇలా మభ్యపెడుతున్నారని “సలార్” టీం ఆరోపణ. అందుకే బాలీవుడ్ లో పివిఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్ల యాజమాన్యాలు “సలార్”కు న్యాయబద్ధంగా తగినన్ని స్క్రీన్లు ఇచ్చేవరకు సౌత్ లో ఆ థియేటర్లలో “సలార్” మూవీని రిలీజ్ చేయకూడదని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఇక ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో సలార్ మూవీకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్నప్పటికీ కావాలనే అక్కడ థియేటర్లు కేటాయించకుండా అడ్డుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారనే విషయం ప్రూవ్ అయ్యిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా ఆ రెండు థియేటర్ల యాజమాన్యాలు దిగి వస్తాయా? అనేది వేచి చూడాలి.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు