HER: రుహాణి శర్మ.. టాలీవుడ్ లో బాగా వినబడే పేరు అవుతుందా?

రుహాణి శర్మ.. “చి.ల.సౌ” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే గాక ఫస్ట్ హిట్ కూడా దక్కించుకుంది. ఆ వెంటనే వరుస అవకాశాలు వచ్చినా, తొందర పడకుండా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. వచ్చిన సినిమా హిట్టయినా , ప్లాప్ అయినా ఈ అమ్మడికి మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలే దక్కేవి. అయితే తాజాగా తనే మెయిన్ లీడ్ గా ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తో వస్తుంది.

“HER” అనే పేరుతో తెరకెక్కిన ఆ సినిమాలో రుహాణి శర్మ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డబల్ అప్ మీడియా బ్యానర్ లో రఘు సంకురాతి, దీప నిర్మించారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేసిన HER మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాను ఎక్కువగా కొత్త ఆర్టిస్ట్ లతోనే తెరకెక్కించగా ట్రైలర్ మాత్రం సీరియస్ గా డిజైన్ చేసి ఉంది. దీన్ని బట్టి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఉండదు అని అర్థమవుతుంది. ట్రైలర్ కు పవన్ అందించిన మ్యూజిక్ బాగుంది.

ఇక ట్రైలర్ చివర టైటిల్ కార్డు పక్కన చాప్టర్1 అని పడింది. అంటే ఈ సినిమా పార్ట్ వైస్ గా తెరకెక్కుతుందన్నమాట. గతంలో ఇలాగే “హిట్” సిరీస్ పార్ట్ లాగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో రుహాణి శర్మ టాలీవుడ్ లో పాతుకుపోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసుకుని HER సినిమా జులై21 న విడుదల అవడానికి సిద్ధం అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు