Ravi Teja : మరోసారి యంగ్ హీరోయిన్స్ తో..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరో ఎవరంటే.. రవితేజ అని చెప్పొచ్చు. మాస్ మహా రాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా మారుతున్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా, త్వరలోనే ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న వాల్తేరు వీరయ్య కూడా రాబోతుంది. ఇవి ఇంకా పూర్తిగా షూటింగ్ పూర్తికాక ముందే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లినట్టు సమాచారం.

రవితేజ చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం పోలాండ్ లో జరుగుతుంది. ఈ సినిమాలో మాస్ మహా రాజా సూపర్ స్టైలీష్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్. అలాగే దీనికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా కార్తిక్ ఇప్పటి వరకు DOP గా ఇండస్ట్రీ కి పరిచయం. కార్తిక్ ఘట్టమనేని ఇప్పటికే నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమా చేశాడు. ఇప్పుడు రవితేజతో రెండో సినిమా చేయబోతున్నాడు. దీనికి ఈగల్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా ఈ కొత్త సినిమా గురించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్ తో పాటు ఏక్ మినీ కథ ఫేం కావ్య థాపర్ ను ఎంచుకున్నారట. కాగా రవితేజ సినిమాల్లో యంగ్ హీరోయిన్స్ ఉండటం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. ధమకా సినిమాలో రవితేజ సరసన యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త సినిమాలో రవితేజతో అనుపమ, కావ్య థాపర్ రొమాన్స్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు