Prabhas : సమ్మర్ లో ?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో కృతిస‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు. ఈ  మూవీకి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ మంచి హైప్ ని క్రియేట్ చేసింది. టీజ‌ర్ మాత్రం అభిమానుల‌ను కాస్త నిరాశ ప‌రిచింద‌నే చెప్పాలి. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి సోష‌ల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ‌గా వినిపించాయి.

అస‌లు ఆదిపురుష్ సినిమా యానిమేష‌న్ సినిమానా అని నెటిజ‌న్లు కామెంట్స్ చేయ‌డం విశేషం. ఇక ఆ త‌రువాత 3డీలో చూసిన తరువాత  కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయిన‌ప్ప‌టికీ నెటిజ‌న్ల‌తో పాటు కొంత మంది న‌టులు కూడా ఆదిపురుష్ సినిమా యానిమేష‌న్ సినిమానా అనే సందేహంలో ఉన్నారు. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ రామాయ‌ణం ఆధారంగా ఆదిపురుష్ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌డంతో అభిమానులు రాముడు అంటే ఇలా ఉంటాడు.. అని అలా ఫిక్స్ అయిపోయారు.

పాత కాలం రామాయ‌ణం సినిమాల‌తో పోల్చుకుంటున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా టీజర్ విడుదల చేసిన సమయంలో  సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా వాయిదా ప‌డింద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ రేస్ నుంచి త‌ప్పుకొని స‌మ్మ‌ర్‌కి వాయిదా ప‌డింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌టన చేయ‌లేదు. ఆదిపురుష్ సినిమా వాయిదా ప‌డుతుందో సంక్రాంతి బ‌రిలో ఉంటుందో అనేది మూవీ మేక‌ర్స్ స్పందిస్తే కానీ ఓ క్లారిటీ రాదు. ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుంద‌నేది వేచి చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు