Raviteja: అన్ని కుదిరితే రవన్నతోనే బోణి?

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరో ఎవరంటే మాస్ మహారాజ రవితేజ అనే చెప్పాలి. అవును.. రవితేజ గత ఏడాది కాలంగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ ధమాకా, ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్స్ అందుకోగా, ఆ వెంటనే “రావణాసుర”, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ప్లాపులు అందుకోవడంతో రవితేజ గ్యాప్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అదేమీ పట్టించుకోకుండా తన సినిమాలు పూర్తి చేస్తూనే కొత్త సినిమాలు కూడా ఒకే చేసేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే “ఈగల్” సినిమాతో బిజీగా ఉన్న రవితేజ, ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో చేయనున్నాడు. ఈ సినిమా వీళ్ళ కాంబో లో నాలుగోది కావడం విశేషం. ఇక లేటెస్ట్ గా మాస్ రాజా ఖాతాలో మరో సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. రవితేజ కి లాస్ట్ ఇయర్ ధమాకాతో బ్లాక్ బస్టర్ కథని అందించిన బెజవాడ ప్రసన్న కుమార్ తాజాగా మరో కథని వినిపించాడని, ఆ కథకి రవితేజ ఇంప్రెస్ అయినట్టు సమాచారం అందింది. అయితే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా లేక కథ మాత్రమే తీసుకుంటారా అనే విషయంలో సందిగ్ధత నెలకొని ఉంది.

ఇక బెజవాడ ప్రసన్న కుమార్ నాగార్జున హీరోగా వస్తున్న నా సామీ రంగ కి కూడా తానే డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల కథని మాత్రమే అందించాడు. ఇప్పుడలాగే రవితేజ సినిమా కి కూడా డైరెక్షన్ ఛాన్స్ అడిగాడు, కానీ రవి ఒకే చెప్తాడా లేదా అన్న సస్పెన్స్ లో ఉన్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగా పీపుల్స్ మీడియా బ్యానర్ లో రవితేజ ఒక సినిమా చేయాల్సి ఉంది. దానికి అడ్వాన్స్ కూడా తీసుకుని చాలా రోజులైంది. అన్ని కుదిరితే ఈ బ్యానర్ లోనే ప్రసన్న కుమార్ సినిమా ఒకే అవుతుంది. అయితే రవితేజ కి హరీష్ శంకర్ కూడా ఒక కథ వినిపించాడు. ఆ ప్రాజెక్ట్ కూడా ఒకే అయినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ గా ఉండడం వల్ల ఉస్తాద్ సినిమా కూడా ఆగిపోయింది. కాబట్టి హరీష్ శంకర్ సినిమా కూడా పీపుల్స్ మీడియా బ్యానర్ లో వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవన్నీ కాకుండా వివి వినాయక్ కూడా రవితేజ కి కథ వినిపించాడు. ఇక చాలా ఏళ్ల వీళ్ళ ఫ్రెండ్షిప్ కారణంగా ఈ సినిమా కూడా ఒకే చేయొచ్చు. కానీ ఫైనల్ గా పీపుల్స్ మీడియా బ్యానర్ లో ఈ ముగ్గురు డైరెక్టర్లలో ఎవరి సినిమా వస్తుందో తెలీదు. ఎక్కువ శాతం హరీష్ శంకర్, లేదా బెజవాడ ప్రసన్న కుమార్ కథలకి ఒకే చెప్పే ఛాన్స్ ఉంది. అన్ని కుదిరితే రవన్న సినిమాతోనే బెజవాడ ప్రసన్న కుమార్ ఫస్ట్ సినిమా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్స్ ఒకే చేయాలంటే సంక్రాంతికి వస్తున్న “ఈగల్” రిలీజ్ తర్వాతే అని సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు