Mahesh Babu: 3 పార్ట్ లుగా రాజమౌళి – మహేష్ మూవీ ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం మహేష్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంబరాల్లో ఉన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ ఆస్కార్ సొంతం చేసుకుంది. దాంతో చిత్ర యూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహేష్ బాబు మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వర్క్ షాప్ కూడా మొదలైందట. త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేస్తున్న సినిమా వచ్చే జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్, రాజమౌళి మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. మహేష్ ప్రాజెక్టును మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ కు తగ్గట్టుగా మూడు భాగాల్లో తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారట రాజమౌళి. హాలీవుడ్ స్టార్స్ కూడా ఉంటారని టాక్ వినిపిస్తోంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు