Tillu Square : టిల్లుగాని కోసం రాధికా అక్కా..

టాలీవుడ్ లో రెండేళ్ల కింద రిలీజ్ అయిన డీజేటిల్లు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా హిట్ అయ్యి, యూత్ ని ఆగమాగం చేసింది ఈ క్రేజీ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తెచ్చుకున్నాడు. అయితే హీరోతో సమానంగా ఈ సినిమాలో సాలిడ్ క్రేజ్ ని సంపాదించింది నేహా శెట్టి. DJ టిల్లు చిత్రంలో టిల్లు పాత్రతో పాటు అందరికి గుర్తుండిపోయే అందమైన నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర ఇప్పటికి చాలా మందికి క్రష్. ఈ హాట్ బ్యూటీ కురిపించిన గ్లామర్, లిప్ లాక్‌లు, బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాకుండా, క్యారెక్టరైజేషన్ కూడా అందరినీ ఇంప్రెస్ చేసింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు డిజే టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ కూడా వస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు మెప్పించగా, మార్చి 29న థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే సాలిడ్ క్రేజీ బజ్ తో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం యొక్క సీక్వెల్ టిల్లు స్క్వేర్‌ ట్రైలర్ లో రాధికా పాత్ర లేకపోవడం చాలా మందికి షాక్‌ ఇచ్చింది. ఈ సీక్వెల్ లో అనుపమ హీరోయిన్ అయినప్పటికీ నేహశెట్టి ని చూపిస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలా చూపించలేదు. అయితే తాజాగా టిల్లు స్క్వేర్ మేకర్స్ నుండి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. టిల్లు స్క్వేర్ లో సినిమా సెకండాఫ్‌లో, రాధికా అలియాస్ నేహా శెట్టి దాదాపు 10 నుండి 15 నిముషాల పాటు కనిపించనుందని సమాచారం.

ఇక ఈ స్పెషల్ అప్పీరెన్స్ తో రాధికా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మనసుల్ని చెదరగొడుతుందని, మూవీ లవర్స్ ని షేక్ చేస్తుందని టాక్ నడుస్తుంది. అయితే టిల్లు స్క్వేర్ లో నేహా శెట్టి ఎంట్రీ సప్రైజ్ లాగా ఉండాలని మేకర్స్ ఈ పాత్రని రివీల్ చేయట్లేదట. ఇక ఈ కల్ట్ ఫిల్మ్ సీక్వెల్‌కి క్రేజ్ తీసుకురావడానికి అనుపమ ఇప్పటికే తన ఇమేజ్‌ని పక్కనబెట్టి హాట్ పెర్ఫార్మన్స్ తో రాధికా లాంటి పాత్రని తిరిగి ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రాధిక అక్కా చిన్న పాత్ర కోసం కూడా మళ్లీ టిల్లు దగ్గరికి వచ్చేస్తోంది. మరి థియేటర్లో వీళ్ళ కాంబో సీన్స్ కి ఏ రేంజ్ లో అరుపులు ఉంటాయో.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు