”పుష్ప ది రైజ్”… గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా హిట్ కావడంతో, అల్లు అర్జున్ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. అంతే కాదు ఈ సినిమాకు అలాగే ఇందులో నటించిన యాక్టర్లకు మంచి అవార్డులు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులంతా ఈ సినిమా కు సంబందించిన రెండవ భాగం అయిన ”పుష్ప ది రూల్” కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి నట విశ్వరూపాన్ని చూపించారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ‘పుష్ప 2’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.ఇది ఇలా ఉండగా, ఈ సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read More: Ahimsa: పోటీ పడుతున్న తమ్ముళ్లు – నెగ్గేదెవరు..?
ఈ సినిమా మొదటి పార్ట్ లో ఫహద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే. బన్వర్ సింగ్ షికావత్ పాత్రలో ఫదాహ్ నటించాడు. ఈ సినిమాలో ఆయనది ముఖ్య పాత్ర. అయితే, పుష్ప 2 లో ఫాహద్ కనిపించబోరని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన పాత్రలో మరో విలన్ ను తీసుకుంటారని సమాచారం అందుతోంది. ఆయనకు కొన్ని డేట్స్ సెట్ కాకపోవడంతో, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్, సాయి పల్లవి ఎంతోమంది నటిస్తారని, గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అనే విషయానికి మేకర్స్ అధిరికారిక ప్రకటన చేసేవరకు క్లారిటీ రాబోదు.
Read More: Bollywood Actress: సొగసు చూడతరమా.. ఈ వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీ?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్...
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా...
తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి...
నేహా శెట్టి.. ఈ పేరుకంటే రాధిక అని పిలిస్తేనే...
ప్రస్తుతం చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ తో...