Prabhas : మిర్చి తర్వాత మళ్లీ..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలే చేస్తూ వస్తున్నారు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. ఆయినా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులో సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టుల మధ్య ఎవరు ఊహించని విధంగా ఓ దర్శకుడు తో ప్రభాస్ సినిమా చేయటానికి రెడీ అయిపోయారు.

ఆ దర్శకుడెవరో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. మారుతి.. కొన్ని నెలల నుంచి ప్రభాస్ మారుతి సినిమాపై వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. తాజాగా మారుతి సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయిందని సమాచారం. ఇది ఇలా ఉండగా, ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక వార్త వినిపిస్తుంది. దీని ప్రకారం మారుతి ఈ సినిమాను పక్కాగా యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీగా తెరకెక్కించనున్నారట.

అలాగే మిర్చి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమాల్లో ఫ్యాన్స్ ఆశించే స్థాయి స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ రాలేదు. అయితే మళ్ళీ తన మూవీ ద్వారా డార్లింగ్ కి అదిరిపోయే రేంజ్ లో ఒక పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్ ని ప్లాన్ చేశారట మారుతి. అంతేకాదు.. మిగతా సాంగ్స్ విషయంలో కూడా పక్కాగా కేర్ తీసుకోనున్నారట. కాగా, ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు