Oke Oka Jeevitham : శర్వ కోసం కోలీవుడ్ స్టార్..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు శర్వా. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న చిత్రం “ఒకే ఒక జీవితం”. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలోనే ఇప్పుడు “ఒకే ఒక జీవితం” అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా, రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ కి తల్లిగా అక్కినేని అమల నటిస్తోంది.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూవీ నుండి ముచ్చటగా మూడవ సాంగ్ ను ఇవాళ విడుదల చేయనుంది యూనిట్. అయితే ఈ సాంగ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. తమిళ స్టార్ యాక్టర్ కార్తీ పాడిన ‘మారిపోయే..’ అనే పల్లవి తో ఈ పాట ఉండనుంది. ఈ సాంగ్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు తాజాగా యూనిట్ ప్రకటించింది.

నిజానికి ఈ సాంగ్ ఎవరు పాడారు అనే దాని గురించి ఇటీవల చిన్నపిల్లలతో ఒక వీడియో బైట్ రిలీజ్ చేసి హింట్ ఇచ్చింది యూనిట్. కాగా ఫైనల్ గా కార్తీ ఈ సాంగ్ పాడుతున్నారని తెలియడంతో ఫ్యాన్స్ తో పాటు, ఆడియన్స్ అందరూ కూడా సాంగ్ ఎలా ఉంటుందో అని ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు