Sharwanand : మరో ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ?

హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు హీరో శర్వానంద్. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న చిత్రం “ఒకే ఒక జీవితం”. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలోనే ఇప్పుడు “ఒకే ఒక జీవితం” అనే సినిమా చేస్తున్నాడు. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలను అందించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా, రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శర్వానంద్ కి తల్లిగా అక్కినేని అమల నటిస్తోంది.

జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 7 న జరపనున్నారు. రేపు హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వర్షన్ సెంటర్ లో సాయంత్రం 6 నుండి ఈ ఈవెంట్ జరగనుంది.

దీనిపై మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ రోజు ఈ వార్తపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు