Sita Ramam : ఫైనల్ గా వచ్చేస్తుంది

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా చేసిన రెండో చిత్రం సీతారామం. మొదటి సినిమా మహా నటి. ఈ సినిమాలో దుల్కర్, సల్మాన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన టాలీవుడ్ తెర పై కనిపించారు. మృణాల్ ఠాకుర్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకం పై అశ్విని దత్ నిర్మించారు. ఆగస్టు 5వ తేదీన వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.

ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన సీతారామం చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. దీంతో వైజయంతి మూవీస్ కు చాలా రోజుల తర్వాత బిగ్ హిట్ లభించింది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 80 కోట్ల వరకు వసుళ్లు చేసింది. అలాగే ఇటీవల హిందీలో కూడా విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఇప్పటికే థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. దీంతో ఓటీటీకి రావడానికి సిద్ధమైంది.

చిత్ర యూనిట్ కూడా సీతారామం ను ఓటీటీకి ఇవ్వడానికి సర్వం సిద్ధం చేశారు. చాలా రోజుల నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో.. సీతారామం సినిమాను భారీ ధరకు దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అప్పట్లో అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఇప్పుడు సీతారామం అమెజాన్ ప్రైమ్ లో రాబోతుందని అధికారికంగా తెలుస్తుంది. ఈ నెల 9 నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు