Allu Arjun : సంస్కృతిని మర్చిపోలేదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి సోమవారం జరిగిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో సందడి చేశారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గీత ఆర్ట్స్ ఆఫీసులో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్ తన బృందంతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కూతురిని పక్కన పెట్టుకొని స్వామికి వీడ్కోలు పలుకుతూ కొబ్బరికాయ పగలగొట్టాడు అల్లు అర్జున్.

కారులో గీత ఆర్ట్స్ వద్దకు వచ్చి బన్నీ వినాయకుడిని నిమర్జనానికి పంపుతూ రోడ్డుపై చిందులు వేశారు. తన కూతురు అర్హ ను కుడా బండి పై డాన్స్ వేయించాడు. ఇక బ్లాక్ డ్రెస్ లో అల్లు అర్జున్ కనిపించగా.. పింక్ కలర్ గౌన్ లో అల్లు అర్హ ఎంతో ముద్దుగా సందడి చేసింది. ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్.. భారతీయ సంస్కృతిని మరచిపోకుండా రోడ్డుపైకిి రావడంతో ఆయన అభిమానులు, నెటిజెన్లు కొనియాడుతున్నారు.

ఇక బన్నీ మూవీ పుష్ప స్టైల్ లోని కొన్ని విగ్రహాలు వెలసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి నగరాల్లో పుష్ప స్టైల్ గణేష్ విగ్రహాల ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు