Prabhas : ఎలా ఉంటుందో ?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈశ్వ‌ర్ సినిమాతో ప్ర‌భాస్ సినీరంగంలోకి ప్ర‌వేశించి త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా వ‌ర్షం, ఛ‌త్ర‌ప‌తి, బాహుబ‌లి సినిమాలు ప్ర‌భాస్ కెరీర్‌నే మార్చేశాయ‌నే చెప్ప‌వ‌చ్చు. బాహుబ‌లి సినిమా త‌రువాత ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. బాహుబ‌లి సినిమా త‌రువాత వ‌చ్చిన సాహో, రాధేశ్యామ్ వంటి సినిమాలు కూడా పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌లై కాస్త నిరాశ ప‌రిచాయి.

అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఆదిపురుష్‌, స‌లార్ సినిమాల్లో న‌టిస్తున్నాడు. తాజాగా టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాలో న‌టించ‌నున్నారు ప్ర‌భాస్‌. ఇక ఆదిపురుష్ సినిమా నుంచి ఇప్ప‌టికే టీజ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ టీజ‌ర్ నెటిజ‌న్ల నుంచి ట్రోలింగ్ కి కూడా గురైంది. 3 డీలో చూస్తూ మాత్రం చాలా అద్భుతంగా ఉన్న‌ట్టు నెటిజ‌న్లు పేర్కొన్నారు. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌భాస్ న‌టించే సినిమాల నుంచి ఒక్కో సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్ రానున్న‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ప్ర‌భాస్-మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా ఫోటో షూట్ అక్టోబ‌ర్ 21, 22 తేదీల్లో నిర్వ‌హించి.. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సమాచారం. ఆదిపురుష్ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ప్ర‌భాస్-ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న‌ల్‌లో తెర‌కెక్కే స‌లార్ సినిమా నుంచి గ్లింప్స్ విడుద‌ల చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మ‌రికొంద‌రూ స‌లార్ సినిమా నుంచి మాత్రం విడుద‌ల కావ‌ని పేర్కొంటున్నారు. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌భాస్ న‌టించిన బిల్లా సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. రెబ‌ల్ సినిమా అక్టోబ‌ర్ 15న థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. 2009లో ప్ర‌భాస్‌-కృష్ణం రాజు క‌లిసి బిల్లాలో న‌టించారు. మొత్తానికి ప్ర‌భాస్ బ‌ర్త్ డే రోజు ప్ర‌భాస్ అభిమానుల‌కు పండుగ వాతావ‌ర‌ణం ఉండ‌నుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు