Srikanth Addala: పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ డిటైల్స్! గెస్ట్ ఆ హీరోయేనా?

Srikanth Addala:

టాలీవుడ్ లో ఈ నెల చివరి వారంలో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అందులో ఒకటి బోయపాటి రామ్ కాంబో లో వస్తున్న స్కంద, మరొకటి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “పెదకాపు”. నిజానికి ఈ సినిమా పై ముందు పెద్దగా అంచనాలేమి లేవు. శ్రీకాంత్ అడ్డాల ప్లాప్స్ వల్ల, కొత్త హీరో కావడం వల్ల స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీ జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ పెదకాపు ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని వచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేసాయి.

దీనికి తోడు రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్, మరియు ట్రైలర్స్ పెదకాపు పై హైప్ అమాంతం పెంచేసాయి. ఇక పెదకాపు రిలీజ్ టైం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేసారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విక్రాంత్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు హెదరాబాద్ లో హైటెక్ సిటీ శిల్పకళావేదిక లో జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు.

అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు వస్తున్నారో ఇప్పటివరకు తెలుపలేదు. అయితే ట్రేడ్ వర్గాల్లో మాత్రం నందమూరి బాలకృష్ణ ఈవెంట్ కి రావొచ్చన్న టాక్ గట్టిగా నడుస్తుంది. పైగా బాలయ్య కి చాలా రోజుల తర్వాత అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కాబట్టి, ఆ సాన్నిహిత్యం తో బాలయ్య ఖచ్చితంగా రావొచ్చని చెప్పొచ్చు. ఇక పెదకాపు సెప్టెంబర్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు