Pawan Kalyan : హరి హర వీరమల్లు వచ్చేస్తున్నాడు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నాడు. తాను చేస్తున్న సినిమాలను దాదాపుగా పక్కన పెట్టేశాడు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సగానికి కంటే ఎక్కువ షూటింగ్ జరుపుకుంది. భవదీయుడు భగత్ సింగ్, వినోదయ సీతం రీమేక్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటం వల్ల సగం షూటింగ్ జరుపుకున్న హరి హర వీరమల్లు ఆగిపోయింది. పవన్ ఎప్పుడు వస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

పవన్ ఇటీవల వైరల్ ఫీవర్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీని నుండి కోలుకున్న తర్వాత హరి హర వీరమల్లుకు టైం కేటాయించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారట. దీని గురించి ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ కు సమాచారం కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఆగస్టు 11వ తేదీ నుండి హరి హర వీరమల్లు షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

ముందుగా పవన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, తర్వాత ఇతర పాత్రలపై ఫోకస్ పెట్టాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారని టాక్. కాగ హరి హర వీరమల్లు సినిమా 2020 సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది. కరోనా వైరస్ తో పాటు పవన్ పాలిటిక్స్, ఇతర సినిమాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు పవన్ డేట్స్ ఇస్తే సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. అయితే, ఈ సినిమాను ముందుగా సంక్రాంతి బరిలో ఉంచాలని అనుకున్నారు. కానీ సంక్రాంతిలోపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వడం దాదాపు కష్టమే. దీంతో సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ ఉండకపోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు