GodFather : స్పెషల్ గెస్ట్ ఎవరంటే ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాద‌ర్స్ అక్టోబ‌ర్ 5న విడుద‌ల అవ్వ‌బోతుంది. తాజాగా ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ కూడా ప్రారంభించారు. సల్మాన్ ఖాన్ స్పెష‌ల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంపై మంచి బ‌జ్ ఉంది. కానీ మేక‌ర్స్ ఊహించినంత హైప్ రావ‌డం లేద‌నే చెప్పాలి. అనంత‌పురంలో జ‌రిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు నిన్న ప్ర‌క‌టించారు. మ‌రోవైపు అక్టోబ‌ర్ 25న ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు.

గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని గెస్ట్ గా తీసుకురావాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. చిరంజీవి-ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకే వేదిక‌పై క‌నిపించి చాలా రోజులు అవుతుంది. సైరా ఈవెంట్ త‌రువాత మ‌ళ్లీ స్టేజీ పై ఇద్ద‌రు క‌నిపించ‌లేదు. ఇక ఈ ఈవెంట్‌కి ఎలాగో స‌ల్మాన్ వ‌స్తారు. అదేవిధంగా స్పెష‌ల్ గెస్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌వ‌స్తే సినిమాకు క్రేజ్ వ‌స్తుంద‌ని, మెగా ఈవెంట్ హైలెట్ అవుతోందని అంద‌రూ అనుకుంటున్నారు.

అందుకోస‌మే ప‌వ‌న్‌ని గెస్ట్‌గా పిల‌వాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. స‌ల్మాన్ ఖాన్ హిందీ మార్కెట్ కోసం వాడుకోవాల‌ని చూస్తున్నారు. ముంబైలో కూడా హిందీ వ‌ర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్‌ని రంగంలోకి దింపాల‌ని చిరంజీవి అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ప‌వన్ క‌ళ్యాణ్ అన్న‌య్య చిరు సినిమాకు త‌న స్పీచ్‌తో ఎలాంటి హైప్ తీసుకొస్తాడో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు