OG: అక్కడ పవర్ స్టార్ బిజీ – అయినా ఆగని ‘ఓజి’ -సుజిత్ ప్లానింగ్ అదుర్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు పవన్. ఇప్పటికే బ్రో సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతానికి పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ లో బిజీగా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.

అయితే, ఓజి షూటింగ్ మాత్రం గ్యాప్ లేకుండా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లేకపోయినా మిగతా ఆర్టిస్ట్స్ కి సంబంధించిన సీన్స్ షూటింగ్ జరిగేలా సుజిత్ ప్లాన్ చేశాడని సమాచారం. మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో కనిపించనుండటంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో కనిపించనున్నాడన్న వార్త సినిమాపై అంచనాలను పెంచుతోంది. యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2024 డిసెంబర్ కి రిలీజ్ సిద్ధమవుతున్న ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది.

- Advertisement -

మొత్తానికి పవన్ లైనప్ లో ఉన్న క్రేజీగా ప్రాజెక్ట్ గా ఉన్న ఓజి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. సినిమా మొదలైనప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు