Kanguva: ఇది కదా డిఎస్పీ ఫ్యాన్స్ కోరుకునేది..!

టాలీవుడ్ కి ఎర్లీ 2000s లో ఒక మ్యూజికల్ సునామి పరిచయమయ్యింది. ఆ సెన్సేషన్ పేరే దేవిశ్రీ ప్రసాద్, దేవి సినిమాతో మొదలైన ఆ సెన్సేషన్ రెండు దశాబ్దాల పాటుగా తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది.మెలోడీ, మాస్ బీట్, ఫాస్ట్ బీట్, ఫోక్, ఫ్యూజన్, వాట్ నాట్..! ప్రతి జానర్లోనూ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవి గత కొంత కాలంగా అతని స్టామినాకి తగ్గ అవుట్ ఫుట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. తన బీజీఎమ్ తో ఏవరేజ్ సీన్స్ ని కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఎలివేట్ చేయగల డిఎస్పీ రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ ఇచ్చిన సినిమాల్లో అంతటి రేంజ్ లో అలరించలేకపోతున్నాడు.

ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమాల్లో ఒక్క పుష్ప మినహా ఏ సినిమాకు ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా మ్యూజిక్ పరంగా పర్వాలేదని అనిపించినా మెగాస్టార్ సినిమా స్థాయిలో మ్యూజిక్ లేదన్న కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేవి మ్యూజిక్ అందిస్తున్న కంగువా సినిమా గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది.

శివ డైరెక్షన్లో సూర్య హీరోగా నటించిన ఈ సినిమా గ్లిమ్ప్స్ కి దేవి అదిరిపోయే బీజీఎమ్ ఇచ్చాడని కామెంట్స్ వస్తున్నాయి. గ్లిమ్ప్స్ లో వాయిలెన్స్ ని, సూర్య హీరోయిజాన్ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసాడు దేవి. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి దేవి ఇచ్చిన బీజీఎమ్ హైలైట్ కానుందని ఒపీనియన్ వస్తున్న నేపథ్యంలో కంగువా సినిమా ద్వారా దేవిశ్రీ ప్రసాద్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Hollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు