#VT14: రిస్క్ చేస్తున్న వరుణ్ తేజ్ – ఈ టైమ్ లో అవసరమా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో గాండీవదారి అర్జున సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు డిసైడ్ చేసేందుకు ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ప్రవీణ్ సత్తారు గత చిత్రం ది ఘోస్ట్ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు.

అసలే గని లాంటి డిజాస్టర్ అందుకున్న తర్వాత వరుణ్ తేజ్ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వటం పట్ల మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ కమిట్ అయిన మరో ప్రాజెక్ట్ మెగా ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. డైరెక్టర్ కరుణ కుమార్ తో 1960s బ్యాక్డ్రాప్ లో ఒక పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఒక కమిట్ అయ్యాడన్న వార్త మెగా అభిమానుల్లో ఆందోలన పెంచుతోంది.

ఏ హీరో అయినా డిజాస్టర్ ఉన్న సమయంలో హిట్ డైరెక్టర్స్ తో సినిమా చేయటానికి ట్రై చేస్తాడు కానీ, వరుణ్ తేజ్ వరుసగా ఫ్లాప్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. ఈ వారంలో పారరంభం కానున్న కరుణ కుమార్ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం అందుతోంది.

- Advertisement -

బ్యాక్ డ్రాప్ పరంగా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం వరుణ్ తేజ్ కి కీలకంగా మారింది. కెరీర్ ఆరంభం నుండి డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ తన ప్రత్యేకత చాటుకున్న వరుణ్ కథలో ఆ మాత్రం విషయం లేనిది ఫ్లాప్ డైరెక్టర్స్ ఎందుకు ఛాన్స్ ఇస్తాడని కొంత మంది అభిప్రాయ పడుతున్న నేపథ్యంలో ఫ్లాప్ డైరెక్టర్స్ వరుణ్ తేజ్ కి బ్లాక్ బస్టర్స్ ఇస్తారా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు