#VS10: స్పీడ్ పెంచిన మాస్ కా దాస్..!

దాస్ కా ధమ్కీ సినిమా ద్వారా డీసెంట్ హిట్ అందుకున్న హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. దాస్ కా ధమ్కీ కి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన విశ్వక్, ఆ సినిమా స్టార్ట్ అయ్యేలోపు కృష్ణ చైతన్య డైరెక్షన్లో గోదావరి బ్యాక్డ్రాప్ లో యాక్షన్ సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న క్రమంలో విశ్వక్ సేన్ ఇంకో సినిమా షూటింగ్ సైలెంట్ గా పూర్తీ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

VS10 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్, గ్లింప్స్ ఆగస్టు 6న రానుందని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. అంతే కాకుండా త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. కెరీర్ ఆరంభం నుండి డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి సైమల్టేనియస్ గా నటిస్తోందని సమాచారం అందుతోంది. దాస్ కా ధమ్కీ సినిమా ద్వారా పాన్ ఇండియా అటెంప్ట్ చేసి పర్వాలేదని అనిపించిన ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్స్ అందుకుంటాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు