Bhagavanth Kesari: బాలయ్య ను తొక్కేయాలని చూస్తున్నారా..?

ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన కథానాయికగా కాజల్ నటిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ ‘ఖుదు గువా’ సినిమాకి భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో హీరో తన ప్రియురాలికి ఇచ్చిన మాట కోసం శత్రువులను చంపి స్నేహితుడి కోసం జైలుకు వెళతాడు. అయితే తాను తండ్రి కాబోతున్నాననే విషయం హీరోకి తెలియదు. ఇక తనకి కూతురు జన్మించి తండ్రి ఎలా ఉంటాడో తెలియకుండానే పెరుగుతుంది.

ఆ తర్వాత హీరో జైలు నుండి బయటకు రాగానే తన కూతురు ప్రమాదంలో ఉందని తెలుసుకున్న హీరో తన కూతురిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అచ్చం ఇలాంటి స్టోరీ తోనే భగవంత్ కేసరి సినిమా కూడా ఉండబోతుందనే న్యూస్ వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య అభిమానులు మాత్రం ఈ సినిమాని తొక్కేయడానికే కొంతమంది ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు