Tollywood: సిమ్రాన్ చెల్లెలు ఆత్మహత్య వెనుక ఇంత మిస్టరీ వుందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమెకు ఒక చెల్లెలు ఉందని.. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సిమ్రాన్ చెల్లెలు కూడా ఒక హీరోయినే.. ఈమె పేరు మోనాల్ నావెల్.. ఇష్టం అనే సినిమా ద్వారా నటిగా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె సిమ్రాన్ చెల్లెలు కావడంతో తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో ఆఫర్లు దక్కించుకుంది.

అంతేకాదు పలు యాడ్స్ లో కూడా నటించి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కాగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీని కలచి వేసిందని చెప్పవచ్చు. 2002 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఈమె ఆత్మహత్య చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఉన్నట్టుండి సిమ్రాన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఒక డాన్స్ మాస్టర్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సుజిత్ అనే ఒక కొరియోగ్రాఫర్ ఆమెను మోసం చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అతడే అంటూ వార్తలు వినిపించినా.. అందులో నిజా నిజాలు మాత్రం బయటకి రాలేదు. అలా ఆమె ఆత్మహత్య ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో చాలామంది అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కొరియోగ్రాఫర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన మోనాల్ ఆ తర్వాత అతడు మోసం చేశాడని ఆ మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. ఇక అలా హీరోయిన్గా కెరియర్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సిన మోనాల్ ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోయి జీవితాన్ని చాలించిందని తెలిసి ఇప్పటికే ఆమె అభిమానులు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక సిమ్రాన్ విషయానికి వస్తే.. బాలకృష్ణ తో ఎక్కువ సినిమాలలో నటించి భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా అవకాశాలు మాత్రం ఈమెకు తలుపు తట్టడం లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా మళ్లీ ఆమెకు అవకాశాలు వచ్చి పూర్వ వైభవాన్ని పొందాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు