Hi Naanna : నేచురల్ స్టార్ నాని పొలిటికల్ ఎంట్రీ?

నేచురల్ స్టార్ నాని, అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ఆ సినిమా తర్వాత కొన్ని విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ, మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో నాని ఉన్న స్థాయి వేరు, స్థానం వేరు అని చెప్పొచ్చు. నాని ప్రస్తుతం చేస్తున్న ప్రతి సినిమా కూడా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నాని సినిమా అంటే ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్లిపోవచ్చు అనే రేంజ్ లో నాని కథల సెలెక్షన్ ఉంది.

రీసెంట్ గా దసరా సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాతో శౌర్యవ్ అనే ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అన్ని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం “హృదయం” అనే సినిమాకి సంగీత దర్శకుడుగా పనిచేసిన అబ్దుల్ ఈ సినిమాకి సంగీతం అందించడం. ప్రతి పాట ప్రేక్షకుడికి వినసొంపుగా అనిపించింది.

అలానే ఈ సినిమా టీజర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కూడా నాని ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. లేకపోతే ఈ సినిమాను మొదట క్రిస్మస్ కానుక రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సలార్ సినిమా పోస్ట్ పోన్ వలన ఈ సినిమాని క్రిస్మస్ కంటే ముందుగానే డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 7వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ను తనదైన శైలిలో స్టార్ట్ చేశాడు నాని. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో నాని ఒక పొలిటిషన్ గెటప్ వేసుకుంటూ మీ ఓటును మాకే వేసి మా సినిమాను గెలిపించండి అంటూ, ఇట్లు హాయ్ నాన్న ప్రెసిడెంట్ విరాజ్ అంటూ ట్విట్ చేశాడు. మొత్తానికి పొలిటికల్ హీట్ ని సినిమా వైపు తిప్పడం అనేది ఒక రకమైన మంచి ప్రమోషన్ అని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు