Manoj – Mounika: మనోజ్ పెళ్లికి మంచు వారి ఫ్యామిలీ దూరం ?

మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ దివంగత టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తే భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ గత కొన్ని రోజుల నుంచి రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ మౌనిక రెడ్డిని మనోజ్ ఈ నెల 3న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని, నిన్న హాల్దీ ఫంక్షన్ కూడా జరిగిందని సమాచారం.

అయితే ఈ పెళ్లి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విషయం తెగ చర్చకు వస్తోంది. అదే.. మనోజ్ – మౌనిక ల పెళ్లి మంచు ఫ్యామిలీకి ఇష్టం ఉందా ? మనోజ్ – మౌనిక ల ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి మోహన్ బాబు సీరియస్ గా ఉన్నాడని టాక్ వచ్చింది. ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లో తాను ఒప్పుకునే అవకాశం లేదని మోహన్ బాబు చాలా సార్లు చెప్పాడట. దీంతో మనోజ్, మోహన్ బాబు మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయట.

దీంతో మనోజ్ ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు పెళ్లి కూడా మంచు మోహన్ బాబు ఇంట్లో జరగడం లేదట. మనోజ్ అక్క మంచు లక్ష్మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందని సమాచారం. అయితే ఈ పెళ్లికి మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా రావడం అనుమానమే అని తెలుస్తోంది. మనోజ్ – మౌనిక పెళ్లి మోహన్ బాబు ఇష్టం లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయట. అందులో రాజకీయపరమైన కారణాలు కూడా ఉన్నాయని సమాచారం.

- Advertisement -

మోహన్ బాబుకి ప్రస్తుతం వైసీపీ తో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ, భూమా మౌనిక ఫ్యామిలీ మొత్తం టీడీపీకి చెందింది. దీంతో మోహన్ బాబు ఈ పెళ్లికి ఇప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే దీనిపై మరి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మోహన్ బాబు మనసు మార్చుకున్నాడని, మనోజ్ పెళ్లికి రావడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. అయితే మనోజ్ – మౌనికల పెళ్లికి మోహన్ బాబు, విష్ణు వెళ్తున్నారా ? లేదా అని తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు