PS2: ఇప్పటి జనరేషన్ కి మణిరత్నం సినిమా ఎక్కట్లేదా..?

అప్పట్లో మణిరత్నం సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటి తరం దర్శకుల్లో చాలా మంది మణిరత్నం సినిమాలు చూసి స్ఫూర్తి పొందామని చెప్పుకుంటూ ఉంటారు. మణిరత్నం సినిమాలు సినిమాలు ఇప్పుడు చూసినా కూడా ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది, మణిరత్నం స్టైల్ ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్ కి నచ్చటం లేదు, మణిరత్నం ఔట్ డేట్ అయ్యాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మణిరత్నం సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోవటమే ఇందుకు కారణం. ఆ మధ్య వచ్చిన ఓకే బంగారం సినిమా పర్వాలేదనిపించినప్పటికీ  మణిరత్నం మార్క్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది.

గత సంవత్సరం తన మార్క్ కాని జానర్లో ‘పొన్నియన్ సెల్వన్’ ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించి రిలీజ్ చేశారు. పీఎస్ 1 సినిమా తమిళనాట హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తెలుగు సహా ఇతర భాషల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ తమిళ్ నేటివిటీకి చెందినది కావటం, ఇతర ప్రాంత ప్రేక్షకులకు పరిచయం లేని కథ కావటంతో ప్రేక్షకులు ఆదరించలేదు. సినిమా ప్రమోషన్స్ ఎఫెక్టివ్ గా చేయకపోవటం కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ కి కారణమని చెప్పచ్చు. పార్ట్ 1తో చేతులు కాల్చుకున్న మణిరత్నం ఇటీవల పీఎస్2 తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

పీఎస్2 కూడా పార్ట్ 1లాగే డిజాస్టర్ టాక్ మూట కట్టుకుంది. ఈ క్రమంలో మణిరత్నం ఇక రిటైర్ అవ్వటం మంచిది అన్న కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ తో ఓ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ తో చేసే సినిమా ద్వారా అయినా మణిరత్నం కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు