Tollywood: ఈ వారం అరడజను..అయినా అదొక్కదానిమీదే చూపు

టాలీవుడ్ లో గత వారం స్పై, సామజవరగమన చిత్రాలతో పాటు మరో నాలుగు చిన్న సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో సామజవరగమన ఒక్కటే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం(జులై7) కుడా తెలుగులో పలు చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. గతవారం అరడజను సినిమాలు విడుదలవగా, ఈ వారం కుడా అరడజను చిత్రాలొస్తున్నాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం.

అయితే ఈ సినిమాల్లో ఏ చిత్రానికి కూడా ప్రేక్షకులు సరైన అంచనా వేయలేకపోతున్నారు. అన్నీ చిన్న సినిమాలే కావడం ఒక కారణం అయితే, ఎక్కువ ప్రమోషన్లు లేకుండా రిలీజ్ అవడం మరో కారణం. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ కి ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని కుడా తెలియదు.

ఇక ఉన్నదాంట్లో ఈ సినిమాల్లో మంచి అంచనాలున్నాయంటే అది శ్రీ సింహా హీరోగా నటించిన “భాగ్ సాలే” సినిమాకి అని చెప్పవచ్చు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకుని జులై 7న రిలీజ్ అవుతుంది.

- Advertisement -

ఇక అంతా కొత్త నటులతో తెరకెక్కిన 7:11PM అనే సైన్స్ ఫిక్షన్ డ్రామా కూడా ఈ వారం విడుదల అవుతుంది. అంతే కాక నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా వీటితో పాటే రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలకి ప్రమోట్ బాగానే చేసినా, ట్రైలర్ లు అంతగా మెప్పించకపోవడంతో ఆడియన్స్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించడంలేదు. వీటితో పాటే జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమా జులై 7 న వస్తుంది. ఇక ఇవేగాక ఓ సాథియా, సర్కిల్ అనే చిన్న సినిమాలు కుడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పిస్తాయో తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు