Powerstar: అక్కడ ‘బ్రో’ కష్టాలు తప్పేలా లేవు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి దర్శకుడు ఖని డైరెక్షన్లో నటించిన సినిమా బ్రో. తమిళ హిట్ సినిమా వినోదాయ సీతాం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా జులై 28న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత తేజ్ నుండి వస్తున్న సినిమా కావటం, మొదటిసారి మామ అల్లుళ్ళు కలిసి నటించిన సినిమా కావటంతో రీమేక్ అయినప్పటికీ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లుగా నటించారు.

పెద్దగా కాంపిటీషన్ లేని సమయంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ కి ఏ ఢోకా లేనప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం గట్టి పోటీ ఉండటం ఫ్యాన్స్ ఆందోళనకి గురి చేస్తోంది. ‘ఓపెన్ హ్యామర్’, ‘బార్బీ’, ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికొనింగ్ చాప్టర్1’ వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు ధర్మ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్న రాకీ, రాణి ప్రేమ్ కి కహాని సినిమా రిలీజ్ ఉండటం బ్రో సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్లో ఓజి, హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తుండగా చాలా కాలం కిందట ప్రారంభమైన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో  పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి, రీమేక్ సినిమా అయినప్పటికీ మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు