Kamal Haasan : రజినికి మించి..

కమల్ హాసన్ – శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ” భారతీయుడు 2″. 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ త్రిల్లర్ భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన దాదాపు పాతికేళ్ల తర్వాత తాజాగా కమల్ హాసన్, శంకర్ కలిసి భారతీయుడు 2 సినిమాకి ప్లాన్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ను ప్రకటించగానే ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ, సముద్ర కని కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తో పాటు ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ గైంట్ మూవీస్ ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకోనుంది. అయితే ఈ చిత్రానికి కమల్ హాసన్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి కోలీవుడ్ వర్గాలలో చర్చ మొదలైంది. ఈ భారీ సినిమాకి కమల్ హాసన్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్. కాగా రజినీ కాంత్ ఓ సినిమాకు 100 కోట్ల వరకు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు రజినీ

కోలీవుడ్ నుంచి ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఈ చిత్రంలో కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ పేర్లు వినిపించాయి. అయితే కాజల్ కు పెళ్లి కావడం, ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కాజల్ ఈ ప్రాజెక్టులో ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. ఇటీవల కాజల్.. ఇండియన్ 2 ప్రాజెక్ట్ లో తాను చేరుతున్నట్లు ప్రకటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు