Hanuraghavapudi : ప్రపంచ యుద్ధం నేపథ్యంలో

నాచుర‌ల్ స్టార్ హీరో నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో త‌న కెరీర్‌లో నిలిచిపోయేలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ త‌రువాత అంటే సుంద‌రానికి సినిమా చేశాడు. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్లు మాత్రం సాధించ‌లేక‌పోయింది. నాని ఇప్ప‌టివ‌ర‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఊర మాస్ లుక్ లోకి వ‌చ్చి మాస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

ప్ర‌స్తుతం శ్రీ‌కాంత్ ఓడేలా ద‌ర్శ‌క‌త్వంలో నాని ద‌స‌రా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేతిలో ఉండగానే.. సీతారామం సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడితో నాని మ‌రో సినిమాలో న‌టించ‌బోతున్నాడు. గ‌తంలో నాని హీరోగా నటించిన కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌కు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కావ‌డం విశేషం.

ప్ర‌ధానంగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడి పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌ల తెర‌కెక్కించిన సీతారామం సంచ‌ల‌న విజ‌యంతో ఆయ‌నకు అభిమానులు మ‌రింత పెరిగారు. తాజాగా ద‌ర్శ‌కుడు హ‌నురాఘ‌వ‌పూడి నానితో తీయ‌బోయే సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.  తన  ద‌గ్గ‌ర WW2 (World War II) బ్యాక్‌డ్రాప్‌తో స్క్రిప్ట్ ఉంది అని ఓ ఇంటర్య్వూలో హను చెప్పాడని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది.  WW2 సినిమా తీస్తే హ‌నురాఘ‌వ‌పూడి క్రేజ్ రాజ‌మౌళిలాగా పెరిగిపోవ‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేష‌కులు. వరల్డ్ వార్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే కంచె అనే సినిమాతో  ఈ నేపథ్యంలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించి విజయం అందుకున్నాడు. ఇప్పుడు హను కూడా WW2 నేపథ్యంలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు