Kalyan Ram : బాబాయ్ బాటలో..

నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 18 సినిమాలు చేశాడు. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఎక్కువ సినిమాలు ఫ్లాప్ ను మూటగట్టుకుని నందమూరి ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచాయి. అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లో 18వ సినిమాగా వచ్చిన బింబిసార.. తన కెరీర్ లో ఉన్న లోటును పూడ్చింది. టాలీవుడ్ హిట్స్ లేక సతమతం అవుతున్న సందర్భంలో బింబిసార వచ్చింది.. తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

దీని తర్వాత కళ్యాణ్ రామ్ సినిమాలపై కూడా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పెరిగింది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కూడా.. మంచి జోష్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నందమూరి హీరో చేతుల్లో “అమిగోస్” “డెవిల్ : ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్” తో పాటు ”బింబిసార-2” సినిమాలు ఉన్నాయి. ఇందులో అమిగోస్ సినిమా గతేడాది ఫిబ్రవర్ లోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రలు చేస్తున్నట్టు అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, అమిగోస్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. అమిగోస్ మూవీని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

ముందుగా డిసెంబర్ 2న బాలయ్య నటిస్తున్న వీర సింహ రెడ్డిని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, బాలయ్య సంక్రాంతి బరిలో ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో మైత్రీ వాళ్లు డిసెంబర్ 2ను కళ్యాణ్ రామ్ కు కేటాయించారని సమాచారం. అయితే డిసెంబర్ 2 బాలయ్య కు సెంటిమెంట్ గా వస్తుంది. బాలయ్య గత చిత్రం అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 2నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు బాబాయ్ సెంటిమెంట్ ను అబ్బాయి ఫాలో కాబోతున్నాడు.

మరి బాబాయ్ సెంటిమెంట్ అబ్బాయికి కలిసొస్తుందా ? లేదా.. బెడిసికొడుతుందా అని తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు