Varsha Bollamma: పెళ్లి కొడుకు ఎవరు ?

సినీ పరిశ్రమలో “రేసుకెళ్లే గుర్రం, దూసుకెళ్లే బాణం కంటే త్వరగా దూసుకెళ్ళేవి రూమర్లు” అందులోను వాళ్ళతో వీళ్ళకి పెళ్లి, ఆ హీరోయిన్ ఆ హీరో తో అక్కడికి వెళ్ళాడు, ఇక్కడకి వెళ్ళాడు లాంటి వార్తలైతే మరీ స్పీడ్ గా దూసుకెళ్తాయి, అయితే స్పీడ్ కి కొందరు బ్రేక్స్ వేస్తారు, ఇంకొందరు అసలు పట్టించుకోరు.

ఇక విషయానికి వస్తే వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగెళ్ల ఇటీవలే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను ఖండిస్తూ తనదైన శైలిలో స్వయంగా అనన్య స్పందించింది. తాజాగా ఈ సమస్య ఇప్పుడు నటి వర్ష బొల్లమ్మకు ఎదురైంది, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వర్షకు ఒక ప్రముఖ నిర్మాత కొడుకుతో పెళ్లి జరుగబోతున్నట్లు వార్తలను రాశాయి కొన్ని వెబ్సైటులు.

తాజాగా ఆ వార్తలన్నిటిని ఖండిస్తూ “నాకోసం నాకే తెలియకుండా పెళ్లి చూపులు చేసి ఓక అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు అన్ని వెబ్‌సైట్‌లకు ధన్యవాదాలు ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే, AHA లో స్వాతిముత్యం చూడండి” అంటూ తన ట్విట్టర్ పేజీలో రాసుకొచ్చింది. అలాగే ఫేక్ న్యూస్ కొన్ని వెబ్ సైట్స్ ను షేర్ చేస్తూ ఆ వార్తలలో నిజం లేదని తేల్చేసింది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు