Kajal Agarwal: డైరెక్టర్ కి కాజల్ తల్లి శాపాలు.. నాశనం అయిపోతావ్ అంటూ..!

లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోని స్టార్ స్టేటస్ అందుకున్న కాజల్ అగర్వాల్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ హీరోలతో కూడా కలిసి చిందేసింది. తన అందంతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కాజల్ కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్లు ను వివాహం చేసుకుంది. ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడిప్పుడే సినిమాలలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

మరొకవైపు భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఇదిలా ఉండగా కాజల్ కి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఒక డైరెక్టర్ కి కాజల్ అగర్వాల్ తల్లి నాశనం అయిపోతావ్ అంటూ శాపాలు పెట్టిందట .అయితే ఇందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సినీ ఇండస్ట్రీలో తన పని తాను చూసుకొని వెళ్లిపోవడం తప్పిస్తే ఎదుటి వాళ్ళ లైఫ్ లో వేలు పెట్టడు ఆ డైరెక్టర్.. అలాంటిది ఆయనపై కాజల్ అగర్వాల్ తల్లి విరుచుకుపడడానికి గల కారణం ఏమిటి అంటే ..ఆయన దర్శకత్వంలో ఒక సినిమాలో కాజల్ అగర్వాల్ నటించాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఆమెను కొన్ని కారణాల చేత షూటింగ్ సగం అయిపోయిన తర్వాత తీసేసాడు ఆ డైరెక్టర్.. కారణం ఏంటో తెలియదు కానీ ఆ సమయంలో కాజల్ చాలా హర్ట్ అయింది.. తన స్నేహితుల దగ్గర చెప్పుకొని బాధపడింది కూడా..

- Advertisement -

ఇక ఆమె బాధ చూడలేక కాజల్ తల్లి ఆ డైరెక్టర్ కు శాపనార్థాలు పెట్టేసారట. నా కూతుర్ని ఈ విధంగా ఏడిపిస్తాడా.. సర్వనాశనం అయిపోతాడు వాడు అంటూ దారుణంగా మాట్లాడిందట.. అయితే ఇదంతా కోపంలోనే మాట్లాడిందని ఆ తర్వాత కూల్ అయిపోయిందని సమాచారం.. వాస్తవానికి ప్రతి తల్లి కూడా తన కూతురు బాధపడితే ఇలాగే రియాక్ట్ అవుతారని జనాలు క్లారిటీ ఇస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు