Prabhas: ఆదిపురుష్ ని ఆ ఒక్కటే గట్టెక్కిస్తుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్. జూన్ 16న ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సునామి క్రియేట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు 100కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల సమయంలో నాసి రకం విజువల్స్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కోగా సినిమా యూనిట్ సమయం తీసుకొని వీఎఫెక్స్ ని సరి చేసి ట్రైలర్ వదిలారు. ట్రైలర్ తో విమర్శలకు సమాధానం చెప్పిన యూనిట్ సినిమాపై అంచనాలు పెంచగలిగింది.
తిరుపతిలో గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ సినిమాపై హైప్ ని తారాస్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఆ ఈవెంట్ తర్వాత సౌత్ లో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవటంతో ప్రేక్షకుల్లో రిలీజ్ కి ముందు రోజు ఉండాల్సిన యుఫోరియా అయితే క్రియేట్ కాలేదనే చెప్పాలి. నిజానికి బాహుబలి, RRR లాంటి సినిమాలు ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవ్వగలిగాయి అంటే కథా కథనాలు ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రమోషన్స్ కూడా అంతే కీలకంగా పని చేశాయన్నది వాస్తవం. అలాంటిది ఇంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందిన ఆదిపురుష్ ప్రమోషన్స్ విషయంలో సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి.
రామాయణం కి ఉన్న యూనివర్సల్ రీచ్, ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయేమో గానీ, రికార్డులు తిరగరాసే కలెక్షన్లు రావాలంటే మాత్రం అందరికీ తెలిసిన రామాయణ కథని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఎమోషన్ల కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్ ప్రామిసింగ్ గా అనిపించినప్పటికీ ఎమోషనల్ కంటెంట్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో ఆదిపురుష్ ని కాపాడే అంశం కేవలం వీఎఫెక్స్ మాత్రమే అని అనిపిస్తుంది. మరి, ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ మీకు అలరిస్తుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు