Pawan Kalyan: సంక్రాంతికి సిద్దమవుతున్న అన్నయ్య – తమ్ముడు తప్పుకున్నాడా…?

2024 సంక్రాంతి రేస్ కి ఇప్పటి నుండే సిద్ధమవుతోంది టాలీవుడ్. 2023 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణలు బ్లాక్ బస్టర్స్ అందుకోవటంతో టాలీవుడ్ వింటేజ్ యుఫోరియాని ఎక్స్పీరియన్స్ చేసింది. ప్రస్తుతం సమ్మర్ సీజన్లో పెద్ద సినిమా ఒక్కటి కూడా రిలీజ్ లేకపోవటంతో విడుదలైన చిన్న సినిమాల్లో దసరా, విరూపాక్ష సినిమాలు మాత్రమే హిట్ అవ్వటంతో బోసిపోయింది. ఈ నేపథ్యంలో రేపు రిలీజ్ కానున్న ఆదిపురుష్ పైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈ విషయం అటుంచితే, 2024 సంక్రాంతి సీజన్ కి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం, రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో రానున్న ఈగల్ సినిమాలు బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి.
సుజిత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, పరిస్థితి చుస్తే అలా కనిపించట్లేదు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి పొలిటికల్ క్యాంపైన్ స్టార్ట్ చేయటంతో ఇక ఇప్పుడప్పుడే సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం కనిపించట్లేదు. సంక్రాతి రేసులో పవన్ సినిమా ఆల్మోస్ట్ లేనట్లే అన్న టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్లో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బ్రో డాడీ’ సినిమాకి రీమేక్ గా రూపొందనున్న ఈ సినిమాను త్వరగా పూర్తీ చేసి 2024 సంక్రాంతికి రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట చిరంజీవి. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు