Rules Ranjann: తళుకు బెళుకు సొగసులతో మత్తెక్కిస్తున్న డీజే భామ!

డీజే టిల్లు రాధికా గా తెలుగులో కుర్రకారుని ఆకర్షించిన భామ నేహా శెట్టి. మంగుళూరు కి చెందిన ఈ భామ తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “మెహబూబా” సినిమా ద్వారా పరిచయమైనా డీజే టిల్లు తోనే ఫేమస్ అయ్యింది. పేరుకి కొంచెం నెగిటివ్ రోల్ అయినా తన గ్లామర్ షో తో ఆకట్టుకుని ఆ సినిమా సక్సెస్ లో ఒక భాగం అయింది. అయితే ఆ తరువాత టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడతాయని ఆశపడింది.అది జరగలేదు. మూవీ చాన్సులైతే వస్తున్నాయిగాని పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. గుర్తింపు వచ్చింది టాలీవుడ్ లోనే కాబట్టి దీన్ని వదిలి వేరే ఇండస్ట్రీ వైపు కూడా వెళ్లడం లేదు.

అయినా తన ప్రయత్నాలు ఆపకుండా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లతో హీటెక్కిస్తూ అందాల ప్రదర్శన చేస్తుంది. మరీ బాలీవుడ్ రేంజ్ లో కాకపోయినా సౌత్ ఇండియన్ స్టైల్ లో చీరల్లోనే మంచి పిక్స్ పెడుతూ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోషూట్లతోనైనా తనకి పెద్ద సీనిమాల్లో ఆఫర్లు వస్తాయని అనుకుంటుంది. అయితే కొంత మంది నెటిజన్లు మాత్రం నేహశెట్టికి పెద్ద సినిమాల్లో ఆఫర్లు రావు అని కూడా అంటున్నారు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం నేహా శెట్టి పొట్టిగా ఉండటమే. కొంచెం హైట్ తక్కువగా ఉండే రామ్ లాంటి హీరోల సరసన ఒకటో రెండో ఛాన్సులొస్తాయేమో గాని స్టార్ హీరోలతో కష్టం అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక తాజాగా తెలుగులో కార్తికేయ తో బెదురులంక అనే సినిమాను పూర్తి చేసిన నేహా శెట్టి, ప్రస్తుతం కిరణ అబ్బవరం తో “రూల్స్ రంజన్” అనే సినిమాలో నటిస్తుంది. మరి నేహా శెట్టి చేసే ఫోటోషూట్లతో అయినా పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు