Fighter : కిస్ కాంట్రవర్సీ… హీరో హీరోయిన్లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైర్

గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, దీపిక పదుకొనే హీరో హీరోయిన్లుగా నటించిన ఏవియేషన్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఫైటర్”. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ మూవీ థియేటర్లలోకి రాగా, ప్రేక్షకుల నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు. ముందుగా పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, నాలుగు రోజుల తర్వాత ప్రేక్షకులు “ఫైటర్” వైపు కన్నెత్తి చూడకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడానికి ఇండియాలోని ఎక్కువమంది ఫ్లైట్స్ లో తిరగలేదని అంటూ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి విమర్శలను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ మూవీలోని ఒక కిస్ సీన్ లీగల్ ఇష్యూస్ ని తెచ్చి పెట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ కిస్ కాంట్రవర్సీని లేవనెత్తుతూ “ఫైటర్” టీంకు లీగల్ నోటీసులు పంపించింది.

“ఫైటర్” మూవీ టీంకు తాజాగా భారత వైమానిక దళం (Indian Air force) లీగల్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హీరో హీరోయిన్ల మధ్య ఉన్న కిస్ సీన్ దీనికి కారణం అని తెలుస్తోంది. వాస్తవానికి హృతిక్ రోషన్, దీపికా పదుకొనే మొదటిసారిగా “ఫైటర్” మూవీలో కలిసి నటించారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. ఈ మూవీలో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పటానియా పాత్రలో హృతిక్, స్క్వాడ్రన్ లీడర్ మినాల్ రాథోడ్ పాత్రలో దీపిక నటించారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న లిప్ లాక్ సీన్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే “ఫైటర్” చిత్ర యూనిట్ కు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ లీగల్ నోటీసులు ఇచ్చి షాక్ ఇచ్చింది. హృతిక్, దీపిక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ ధరించి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం అభ్యంతరకరమని అందులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఐఏఎఫ్ యూనిఫామ్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదని, దేశ భద్రత, విధి నిర్వహణ, నిస్వార్థ సేవ పట్ల తమకుండే నిబద్ధతకు బలమైన చిహ్నమని ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

అంతటి ఉన్నతమైన దుస్తులు ధరించి లిప్ లాక్ పెట్టుకోవడం, శృంగార సన్నివేశాలకు ఉపయోగించడం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను కించపరచడమే అవుతుందని ఆ లీగల్ నోటీసుల్లో కమాండర్ సౌమ్య పేర్కొన్నట్టు సమాచారం. ఎయిర్ ఫోర్స్ ఔన్నత్యాన్ని దెబ్బతీసే ఇలాంటి అనుచిత చర్యలను సహించేది లేదని, తాము ఎంతో సున్నిత ప్రాంతంగా పరిగణించే భద్రతతో కూడిన ఎయిర్ ఫోర్స్ రన్ వే మీద లిక్ లాక్ సీన్స్ చేయడం తప్పని ఆమె అన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ సినిమా వల్ల ఎవరైనా ఇలాంటి పని చేస్తే దానికి బాధ్యులు ఎవరని కమాండర్ సౌమ్య ప్రశ్నించారు. ఇప్పటికే సరైన కలెక్షన్లు రాక డిజాస్టర్ టాక్ తో చతికిల పడ్డ “ఫైటర్”కు ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి లీగల్ నోటీసులు రావడంతో మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టుగా అయ్యింది. ఈ వివాదంపై “ఫైటర్” టీం ఇంకా స్పందించలేదు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు