Mental Health : డిప్రెషన్ కు ట్రావెలింగ్ మంచి మెడిసిన్ అని తెలుసా?

సాధారణంగానే ప్రజలు ఫిజికల్ హెల్త్ పై చూపించేటంత శ్రద్ధను మెంటల్ హెల్త్ పై చూపించరు. పైగా దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మెంటల్ గా ఫిట్ గా ఉంటామో అప్పుడే ఫిజికల్ గా కూడా హెల్దీగా ఉంటాము అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ డిప్రెషన్ ఎక్కువైతే అది ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిప్రెషన్ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు ఎందరో. కానీ ఆ డిప్రెషన్ కు చెక్ పెట్టడం కూడా మన చేతుల్లోనే ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. వీలైతే సైకాలజిస్ట్ లను కలుస్తారు, లేదంటే పరిస్థితి చేయి దాటి పోయేదాకా తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. కానీ ట్రావెలింగ్ అనేది డిప్రెషన్ కు మంచి మెడిసిన్ అంటున్నారు సైకాలజిస్ట్ లు. మరి ఇంతకీ ట్రావెలింగ్ వల్ల మెంటల్ హెల్త్ ఎలా సెట్ అవుతుంది? డిప్రెషన్ ఎలా తగ్గుతుంది అంటే…

ట్రావెలింగ్ అనేది డిప్రెషన్ ను పూర్తిగా దూరం చేయకపోవచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా డిప్రెషన్ కు గురయ్యే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి కాగా, 6.5% మంది జనాభా ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఓ సర్వేలో బయటపడింది. అందుకే చాలామంది సైకాలజీ నిపుణులు నిరాశ, కుంగుబాటు ఎదురైనప్పుడు ట్రావెలింగ్ చేస్తే కొంతవరకు డిప్రెషన్ తగ్గుతుందని చెబుతున్నారు. కొత్త ప్రపంచంతో మమేకం కావడం, ట్రావెలింగ్, సాహసాలు, ప్రశాంతమైన వాతావరణంలో గడపడం, స్వచ్ఛమైన గాలిని పీల్చడం వంటివి డిప్రెషన్ ను తగ్గించడానికి హెల్ప్ అవుతాయని చెబుతున్నారు.

సాధారణంగా డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. ఎంత ఒంటరిగా ఉంటే డిప్రెషన్ అంత ఎక్కువ అవుతుంది. కాబట్టి ట్రావెలింగ్ చేయడం వల్ల కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్లతో మీ గురించి చెప్పుకోవడం, వాళ్ల గురించి అడిగి తెలుసుకోవడం వల్ల మనసు కొంచెం తేలిక పడుతుంది. ఆ ఆసక్తికరమైన చర్చ మిమ్మల్ని డిప్రెషన్ నుంచి కొంతవరకు బయట పడేస్తుంది.

- Advertisement -

డిప్రెషన్ కు గురి చేసే ముఖ్యమైన కారకాల్లో నిద్రలేమి కూడా ఒకటి. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో క్షణం తీరిక లేకుండా ఫోన్లు లేదా లాప్టాప్ లతోనే రోజంతా గడపాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మానసిక ఒత్తిడి పెరిగి నిద్ర కరువు అవుతుంది. అది రాను రాను డిప్రెషన్ కు దారి తీస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ప్రయాణాలు లేదంటే పార్కుల్లో వాకింగ్ చేయడం వంటివి చేస్తూ కాస్త కాళ్లకు పని చెప్పండి. వీలైనంత దూరం నడిచి ప్రకృతితో మమేకమవుతూ అలసిపోండి. అప్పుడు మీరు వద్దనుకున్నా సరే నిద్ర దానంతట అదే వస్తుంది.

దట్టమైన అడవులు, స్వచ్ఛంగా ప్రవహించే నదులు, పచ్చిక మైదానాలు, విచ్చుకునే రంగురంగుల పువ్వులు, పర్వతాలు వంటివి కనిపిస్తే కంటికి విందే. ప్రకృతికి ఎంత దగ్గరైతే డిప్రెషన్ అంత దూరం అవుతుంది. సైన్స్ వల్ల నయం కానీ ఎన్నో మానసిక వ్యాధులు ప్రకృతి వల్ల నయం అవుతాయి.

ఇక ప్రయాణాలు అంటే కేవలం కార్లలో తిరగడం మాత్రమే కాదు కొంచెం అడ్వెంచరస్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండేలా చూసుకోండి. ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్, బోటింగ్ వంటివి చేస్తే మీలో ఉత్సాహం పెరగడమే కాదు డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు