Breakup : మాజీ లవర్ తో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకుంటున్నారా? అయితే రూల్స్ ఇవే

లవ్, బ్రేకప్ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. కానీ ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మరిచిపోయే జంట పక్షులు ఆ తర్వాత బ్రేకప్ వల్ల జరిగే పరిణామాలతో చెప్పలేనంత మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది విడిపోయాక తమ పార్ట్నర్ పై ద్వేషం పెంచుకుంటారు. మరి కొంతమంది విపరీతంగా కోపాన్ని చూపిస్తారు. వాళ్లు పొరపాటున ఎక్కడైనా కనిపించినా కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ అతి కొద్ది మంది మాత్రమే మళ్లీ తమ మాజీ లవర్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. బ్రేకప్ అయ్యాక కూడా మంచి ఫ్రెండ్స్ లా వాళ్లతో ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా లవర్స్ తమ కుటుంబం లేదా సామాజిక ఒత్తిడి కారణంగా విడిపోతారు. తాము కలిసి ఉండలేమన్న విషయాన్ని అర్థం చేసుకుని బ్రేకప్ చెప్పుకుంటారు. ఒకవేళ తిట్టుకోకుండా, పోట్లాడుకోకుండా ఆ రిలేషన్ షిప్ ను తెంచుకున్న వారు మాత్రమే బ్రేకప్ తర్వాత కూడా స్నేహాన్ని ఈజీగా కొనసాగించగలుగుతారు.

వాస్తవానికి సమాజంలో ఉన్న కట్టుబాట్ల కారణంగా పెళ్లయ్యాక మాజీ లవర్ తో స్నేహం చేయడం తప్పు అని అంటూ ఉంటారు. అయితే ఎక్స్ లవర్ తో అసలు ఫ్రెండ్షిప్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. లవర్స్ కావడానికి ముందు చాలా కాలం పాటు స్నేహితులుగా ఉండి ఉంటే, బ్రేకప్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ మాజీ లవర్ తో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటే మాత్రం కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ రూల్స్ ఫాలో అయితే ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్ పై ఎలాంటి ప్రభావం పడకుండా, మాజీ లవర్ తో ఫ్రెండ్లీగా ఉండే అవకాశం దక్కుతుంది.

మాజీ లవర్, కొత్త లవర్ అనేవారు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎక్స్ లవర్ తో ప్రస్తుత రిలేషన్ గురించి మాట్లాడితే వాళ్లు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వారిద్దరిని గౌరవిస్తూనే జాగ్రత్తగా మసలుకోవాలి.

- Advertisement -

అయితే మీ మాజీ లవర్ మీతో స్నేహం చేయడానికి ఇష్టపడకపోతే మాట్లాడకపోవడమే మంచిది. ఒకవేళ మాజీ లవర్ తో ఫ్రెండ్షిప్ చేసే క్రమంలో బాధ కలిగినా, అసౌకర్యంగా అనిపించిన దూరంగా ఉండడం బెటర్. ఇద్దరి మధ్య గౌరవప్రదమైన, హెల్దీ రిలేషన్ వర్కౌట్ అవుతుంది అనిపించినప్పుడు మాత్రమే దాన్ని కంటిన్యూ చేయండి.

ఇక లవర్స్ మధ్య కామన్ గా ఉండే ఫీలింగ్ ఇన్ సెక్యూరిటీ. అందుకే మాజీ లవర్ ను ఒంటరిగా కలవకూడదు అని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రస్తుతం మీతో రిలేషన్ లో ఉన్న లవర్ కు గత సంబంధాల గురించి గుర్తు చేయకపోవడం బెటర్. ఈ రూల్స్ ఫాలో అయితే మాజీ లవర్ తో కూడా హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు