Suhas : వీకెండ్లో క్లీన్ హిట్ స్టేటస్.. అయినా ఏం లాభం?

Ambajipeta marraige band

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదన్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత ఒక చిన్న సినిమా మాత్రం ఆడియన్స్ ని సంతృప్తి పరిచేలా ఉంది. అదే ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్”. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాను దుశ్యంత్ కతికనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మరీ ఓ రేంజ్ లో లేకున్నా ఉన్నదాంట్లో డీసెంట్ టాక్ తెచ్చుకుంది. పెద్దగా ప్రమోషన్లు చేయకున్నా మౌత్ టాక్ తో వీకెండ్లోనే హిట్ గీత దాటింది ఈ చిన్న సినిమా.

అంబాజీపేట సినిమాను మేకర్స్ చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేయగా, మూడు రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టి ప్రాఫిట్ జోన్లోకి అడుగుపెట్టింది. 2.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 3 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవగా, రిలీజ్ అయిన 5 రోజుల్లో 3.99 కోట్ల షేర్ 8 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కి థియేటర్లు బాగానే ఉన్నా భారీ లాభాలు వచ్చే ఛాన్స్ మాత్రం మిస్ అవుతుంది. ఎందుకంటే మరో రెండు రోజుల్లో మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ సినిమా ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ అంబాజీ పేట కలెక్షన్ల పై పడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

పైగా పెద్ద సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు ఖాళీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈగల్ సినిమాపై కూడా అంతగా అంచనాలు కూడా లేవు. రవితేజ సినిమా అన్న మాటే గాని సినిమా లో అంత కంటెంట్ లేదని ఇన్సైడ్ టాక్. కనుక ఈగల్ టాక్ అటు ఇటు అయితే సుహాస్ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈగల్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు