Hombale Films: “సలార్” మేనియాను వాడేస్తున్న ప్రొడ్యూసర్స్… అందుకే ఈ అనవసరపు అప్డేట్లు

ప్రస్తుతం ఎక్కడ చూసినా “సలార్” మేనియానే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేయడంతో ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమాను థియేటర్లలో వీక్షిస్తామా అని క్షణాలను సైతం లెక్కబెట్టుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే మరోవైపు మాత్రం “సలార్” ఫీవర్ ను ఈ మూవీని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు వాడేసుకుంటున్నారు. అందుకే ఇలా సమయం, సందర్భం కాకపోయినా తమ సోషల్ మీడియా ఖాతాలలో అనవసరపు అప్డేట్లు ఇస్తున్నారు. ఇంతకీ నిర్మాతలు ఇచ్చిన ఆ అనవసరపు అప్డేట్లు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. సినిమాకు సంబంధించి పెద్దగా ఎలాంటి ప్రమోషన్స్ చేయనప్పటికీ “సలార్”పై హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేట్టుగా ఉంది. అయితే ఈ భారీ హైప్ ను “సలార్” నిర్మాతలు మరోరకంగా వాడేసుకుంటున్నారు. తమ అధికారిక సోషల్ మీడియా ఎకౌంట్లలో తాము నెక్స్ట్ నిర్మించబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్లను షేర్ చేస్తున్నారు. నిజానికి చాలామంది ఈ సమయంలో “సలార్”కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా వెంటనే తెలియాలని ఉద్దేశంతో చిత్ర నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అవుతారు. కానీ హోంబలే ఫిల్మ్స్ మాత్రం తమ నిర్మాణంలో రాబోయే కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఇస్తూ సలార్ హైప్ తో ఇతర సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.

“సలార్” మూవీ రిలీజ్ కావడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియాసిటీని క్యాస్ట్ చేసుకోవడం పక్కనపెట్టి భవిష్యత్తులో తాము నిర్మించబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్ లను పోస్ట్ చేస్తున్నారు హోంబలే ఫిల్మ్స్ వారు. ఇటీవల “భగీర” టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే అదే రోజు ఆ సినిమా హీరో శ్రీమురళీ బర్త్ డే కావడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న “సలార్” మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న ఇలాంటి సమయంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న కొత్త మూవీ “రఘు తాత” అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే “రఘు తాత” మూవీకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి ప్రస్తుతం ఎలాంటి అకేషన్ లేదు. కానీ సడన్ గా “రఘు తాత” త్వరలో రిలీజ్ కాబోతోంది అంటూ హోంబలే ఫిల్మ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో వచ్చిన అప్డేట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో నెటిజెన్లు “సలార్” మేనియాను వాడుకునే క్రమంలోనే ప్రొడ్యూసర్స్ ఈ అనవసరపు అప్డేట్లు ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

 

Hombale Films
Hombale Films

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు