Dunki vs Salaar: నార్త్‌లో సింగిల్ స్క్రీన్స్ వార్… తప్పు మనోళ్లదేనా?

డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” థియేటర్లలో సందడి చేయబోతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డైనోసార్ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నార్త్ లో జరుగుతున్న సింగిల్ స్క్రీన్స్ వార్ డార్లింగ్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన “డంకీ” సినిమా వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

“సలార్” రిలీజ్ కావడానికి కేవలం ఒక్క రోజు ముందే బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “డంకీ” రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కేవలం హిందీలోనే రిలీజ్ అవుతున్నప్పటికీ, షారుక్ ఖాన్ వంటి బడా హీరో సినిమా కావడంతో ఎంత కొంత ఎఫెక్ట్ సలార్ మూవీపై పడే అవకాశం లేకపోలేదు. ముందు నుంచి ఈ రెండు సినిమాల మధ్య నెలకొన్న ఈ బాక్స్ ఆఫీస్ వార్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇటు “సలార్”, అటు “డంకీ” మేకర్స్ తమ రెండు సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే ఆ తర్వాత అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారేమో అనుకుంటే, అలా చేయకుండా ఇద్దరు మొండి చేయి చూపించారు. దీంతో సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని బిగ్గెస్ట్ క్లాష్ రాబోతుందంటూ, ఈ రెండు సినిమాల్లో విన్నర్ ఎవరు కాబోతున్నారో చూడాలని ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు సైతం. అయితే ఇలాంటి తరుణంలోనే నార్త్ లో “సలార్” మూవీకి సింగిల్ స్క్రీన్స్ సమస్య వచ్చినట్లు సమాచారం. అక్కడ ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లో “డంకీ” మూవీనే రిలీజ్ చేస్తున్నారట.

- Advertisement -

యాక్షన్ ఎంటర్టైనర్ గా మాస్ ఆడియన్స్ ను అలరించడానికి వస్తున్న “సలార్” మూవీకి సింగిల్ స్క్రీన్స్ ఇవ్వడానికి అక్కడ మొండి చేయి చూపిస్తున్నారట. నిజానికి “డంకీ” ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాను ఎక్కువగా ఏ సెంటర్స్ లోనే చూస్తూ ఉంటారు. ఇక సింగిల్ స్క్రీన్స్ లో “సలార్” లాంటి మాస్ సినిమాల హవా ఉంటుంది. అయినప్పటికీ నార్త్ వాళ్లు సింగిల్ స్క్రీన్స్ లో ఎక్కువ భాగం “డంకీ” మూవీకే రిలీజ్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేస్తుంది.

నిజానికి ఇంత పెద్ద క్లాష్ వచ్చినప్పుడు థియేటర్స్ విషయంలో ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం “డంకీ” సినిమాకు ఎక్కువ సింగల్ స్క్రీన్ థియేటర్లను కేటాయించి, అక్కడివారు “సలార్”కు హ్యాండ్ ఇవ్వడం చూస్తుంటే కావాలని ప్రభాస్ ను ఎదగనీయకుండా చేయడానికి ఇలా చేస్తున్నారా ? అనే కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో “సలార్” మేకర్ తప్పు కూడా లేకపోలేదు. “డంకీ” మేకర్స్ రిలీజ్ విషయంలో క్లారిటీగా ఉన్నారు. వాళ్లు ముందే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

కానీ “సలార్” విషయంలో మాత్రం అలా జరగలేదు. చాలాసార్లు ఈ మూవీని పోస్ట్ పోన్ చేసి చివరకు సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి సడన్ గా డిసెంబర్ 22న సలార్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి, “డంకీ” మూవీతో క్లాష్ కు సిద్ధమయ్యారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల “సలార్” మూవీ పొటెన్షియల్ హిందీ బెల్ట్స్ లో తగ్గిపోయింది అని చెప్పాలి. మరి ఈ సమస్యను మన డైనోసార్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు