HBD Deepika Padukone: దీపిక గురించి ఎవరికీ తెలియని నిజాలివే..!

దీపికా పదుకొనే.. ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. అంతలా ఈమె తన నటనతో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఈ రోజున దీపికా పదుకొనే 38వ పుట్టినరోజు జరుపుకోబోతోంది. దీంతో దీపికా పదుకొనే గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి చూద్దాం.

బాలీవుడ్ హీరోయిన్ లలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న దీపికా పదుకొనే తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ కపూర్ తో ఆరేళ్లపాటు డేటింగ్ లో ఉన్న దీపికా పదుకొనే 2018 నవంబర్ 14న వివాహం చేసుకోవడం జరిగింది. దీపిక – రణవీర్ కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. దీపికా పదుకొనే హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ ను అందుకుంది. మొదటిసారి కన్నడ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో తప్ప మిగతా అందరి హీరోలతో కూడా నటించింది.

ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి టాలీవుడ్ లో కల్కి సినిమాలో నటిస్తున్నది.. మొదటిసారి బాలీవుడ్ లో దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న దీపిక ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించింది.. వివాహమైన తర్వాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తూ అంతే స్టార్ డం ను సంపాదించుకుంది.. రణవీర్ తో కలిసి మొదటిసారి రామ్ లీలా సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత బాజీరావు మస్తానీ సినిమాలో కూడా నటించింది.

- Advertisement -

అసలు విషయంలోకి వెళ్తే.. దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ స్వతహాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడట.. దేశం తరఫున బ్యాడ్మింటన్ ఆడి ఎన్నో పథకాలను గెలుపొందారు.. తన తండ్రి ఆధ్వర్యంలోనే దీపిక కూడా బ్యాట్మింటన్ నేర్చుకున్నది. సినిమా అవకాశాలు రావడంతో పూర్తిగా బ్యాట్మింటన్ పక్కన పెట్టింది.. ఫిట్నెస్ పెంచుకునేందుకు మాత్రం అప్పుడప్పుడు ఈమె బ్యాట్మెంటన్ ఆడుతూ ఉంటుంది.. సోషల్ మీడియాలో దీపికా పదుకొనే 78.1 మిలియన్ల ఫాలో అవర్స్ ని కలిగి ఉన్నది. దీపికా పదుకొనే కెరియర్లో ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు స్టార్ స్క్రీన్ అవార్డులు ,జిసిని అవార్డులు అందుకోవడం జరిగింది.

దీపికా పదుకొనే ఆస్కార్ వేదిక పైన కూడా సత్తా చాటింది.. దీపికా పదుకొనే కు వంటలంటే చాలా ఇష్టం.. ముఖ్యంగా వేడివేడి అన్నంలో రసం వేసుకొని తినడం అంటే మరీ ఇష్టం అట.. స్వీట్ అంటే మరీ ఇష్టమట.. దీపికా పదుకొనే మెడ పైన ఉన్న టాటూ ఆమె కొత్తగా ప్రమోట్ చేస్తున్న తన బ్రాండ్ పేరు కావడం గమనార్హం.. దీపికా పదుకొనే డిగ్రీ కూడా పూర్తి చేయలేదట.. కానీ సినిమాల ద్వారానే కాకుండా పలు రకాల బ్రాండ్ల ద్వారా భారీగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు