Vinay rai : ఫుల్ జోష్ లో హనుమాన్ మూవీ విలన్..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాల్లో “హనుమాన్” మూవీ కూడా ఒకటి. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుని భారీ వసూళ్లు సాధిస్తూ ఇప్పటికీ పలు థియేటర్లలో రన్ అవుతూ 300 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకుపోతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించడం జరిగింది. ఇక హనుమాన్ సినిమాలో మైఖేల్ గా ప్రతి నాయకుడి పాత్రలో నటించిన వినయ్ రాయ్ కూడా ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందాడు. ఈ హీరో ఒకప్పుడు వాన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే వాన సినిమా అప్పట్లో అంతగా ఆడకపోవడంతో విలన్ గా టర్న్ తీసుకున్నాడు. కానీ ముందుగా ఇతర భాషల్లో విలన్ గా సినిమాలు చేసి ఆ తర్వాత హనుమాన్ తో విలన్ గా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వినయ్ రాయ్ కి వరుస సినిమా అవకాశాలు తెచ్చి పెడుతుంది. కాగా లేటెస్ట్ గా రవితేజ ఈగల్ మూవీ లో
కూడా నెగిటివ్ టచ్ ఉన్న రోల్ లో నటించడం జరిగింది.

ఇదే గాక హనుమన్ మూవీ తర్వాత తెలుగులో మరో రెండు సినిమాల్లో ఛాన్సులు రాగా, హిందీలో మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇకపోతే వచ్చే వారం రిలీజ్ కానున్న రవితేజ ఈగల్ కూడా హిట్ అయితే తెలుగులో ఒక స్టార్ విలన్ దొరికినట్టే అని చెప్పొచ్చు. మరి వినయ్ రాయ్ తెలుగులో విలన్ గానే కొనసాగుతాడా లేదా విలన్ గా ఇంపార్టెంట్ రోల్స్ కూడా చేస్తాడా అనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు