Guntur Kaaram: ఎన్టీఆర్ సినిమా ట్యాగ్ లైన్ కాపీ కొట్టిన గురూజీ..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాకు సంబందించిన టైటిల్, గ్లింప్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ముందు నుండి ప్రచారం జరిగినట్లుగానే ఈ సినిమాకు గుంటూరు కారం టైటిల్ ను ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. మునుపెన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఔట్ అండ్ ఔట్ మాస్ అవతార్ లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచాడు. టీజర్లో ఎలివేషన్స్ కి, థమన్ ఇచ్చిన బీజీఎమ్ కి మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది పక్కన పెడితే, గుంటూరు కారం సినిమా కి వాడిన ట్యాగ్ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

‘హైలీ ఇన్ఫ్లేమబుల్’ అన్న ట్యాగ్ లైన్ గతంలో ఎన్టీఆర్, కృష్ణవంశీ ల కాంబినేషన్లో వచ్చిన రాఖీ సినిమాకు కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉండటంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు మహేష్ అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. గుంటూరు కారం అన్న టైటిల్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ వాడారని, రాఖీ సినిమా నుండి కాపీ కొట్టలేదని మహేష్ ఫ్యాన్స్ డిఫెన్స్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమాల్లో చాలా వరకు అ అక్షరంతో ఉన్న టైటిల్స్ ఉంటాయి కానీ, ఈ సినిమాకు ఆ సెంటిమెంట్ ని మాత్రం ఫాలో అవ్వలేదు. ఒక్క అజ్ఞాతవాసి మినహా అ అక్షరంతో టైటిల్ ఉన్న సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. గుంటూరు కారం సినిమాకు టైటిల్ సెంటిమెంట్ ఫాలో అవ్వకల్పోవటం వల్ల సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. మరి, మహేష్ బాబుని డిఫరెంట్ గా చూపిస్తున్న గురూజీ, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు