Kalyan Ram: బింబిసార 2 నుండి వశిష్ఠ ఔట్ – కారణం ఏంటంటే..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన నింబిసార సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పార్ట్ 2 ఉండనుందని అనౌన్స్ చేశారు, ఈ మేరకు దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడన్న వార్తలొచ్చాయి. అయితే, పార్ట్2 కి దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్ చేయట్లేదని తాజాగా అందుతున్న సమాచారం. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన వశిష్ఠ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత బింబిసార పార్ట్ 2 పై దృష్టి పెట్టనున్నాడు.వశిష్ఠ ఈ సినిమా నుండి తప్పుకోవటంతో మరో కొత్త దర్శకుడి కోసం ప్రయత్నిస్తున్నాడట కళ్యాణ్ రామ్. బింబిసార 2 నిర్మాణంలో డిస్ని హాట్ స్టార్ కూడా భాగస్వామిగా చేరనుందన్న వార్తలొస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో మెరుగైన గ్రాఫిక్స్ ఉండబోతున్న ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం.

ఈ నేపథ్యంలో పార్ట్ 2 కోసం వశిష్ఠ ఎలాంటి కథని సిద్ధం చేశాడు, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించనున్నారు వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరి, పార్ట్ 1 ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, పార్ట్ 2తో ఏ మేరకు అలరిస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు