Guntur Kaaram First Review and Rating: “గుంటూరు కారం” ఫస్ట్ రివ్యూ, రేటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్లింతలు చేసుకుని ఎదురు చూస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషన్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నింటిలో “గుంటూరు కారం” మూవీ పైనే ఎక్కువగా హైప్ ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. మరి మూవీ టాక్ ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

“గుంటూరు కారం” మూవీ ఫస్ట్ రివ్యూలోకి వెళ్తే… ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ బాగా సాగదీసారని, కానీ క్లైమాక్స్ మాత్రం బాగుందని సమాచారం. “గుంటూరు కారం” మూవీకి సంబంధించిన స్పెషల్ షోలను కొంతమంది సినీ ప్రముఖులకు వేయగా, వారి నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మహేష్ బాబులోని మాస్ యాంగిల్ ని త్రివిక్రమ్ బయటకు తీసాడని, షో స్టీలర్ మహేష్ బాబు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ ఈసారి మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేశాడని, ఆ క్రమంలో చాలావరకు లాజిక్స్ మిస్ అయ్యాయని అంటున్నారు. “గుంటూరు కారం” మూవీలో కంటెంట్ కంటే ఎక్కువగా మహేష్ తో మ్యాజిక్ చేసే పనిని పెట్టుకున్నాడట త్రివిక్రమ్. ఒక్క మాటలో చెప్పాలంటే “గుంటూరు కారం” యావరేజ్ బొమ్మ అని టాక్. నిజానికి “గుంటూరు కారం” మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతో ఉన్నారు మహేష్ అభిమానులు. కానీ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే స్టోరీ మొత్తం రివీల్ అయింది. మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా నడుస్తుందని, రాజకీయాల కారణంగా తన ఫ్యామిలీకి దూరమైన కుర్రాడు, ఆ తర్వాత గుంటూరులో పెరిగి, తన తల్లికే ఎదురుగా నిలబడి పోరాడాల్సి వచ్చిన నేపథ్యంలో హీరో ఏం చేస్తాడు అన్న స్టోరీ లైన్ తోనే “గుంటూరు కారం” మూవీ రూపొందిన విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది.

అయితే ట్రైలర్ లోనే ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, ఇంకా రొమాన్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉంటాయన్న విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మొట్టమొదటిసారిగా మహేష్ బాబులోని మాస్ యాంగిల్ ను బయట పెడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఈ ప్రయత్నంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ రివ్యూ చూసుకుంటే యావరేజ్ అంటున్నారు. మరి “గుంటూరు కారం” మూవీ ఈ భారీ హైప్ ను మ్యాచ్ చేసేలా ఉంటుందా? బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుంది? ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ సంక్రాంతి సీజన్ లో “గుంటూరు కారం” మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలి అంటే జనవరి 12 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ మూవీకి ఎక్స్పెక్టెడ్ రేటింగ్ 2.5 నుంచి 2.75 వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు